
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'షైతాన్'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్ కొనసాగుతుంది.
సరదాగా సాగిపోతున్న కబీర్ (అజయ్) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ.
ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాధవన్ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' (Vash) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.