'సన్ ఆఫ్ సర్దార్'.. 2012లో వచ్చిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇది తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే! పుష్కరకాలం తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించనున్నాడు.
ప్రవర్తన బాగోలేదనే..
ఈ సీక్వెల్‌లో నటుడు విజయ్ రాజ్‌ను కూడా సెలక్ట్ చేశారు. తర్వాత అర్ధాంతరంగా అతడిని సినిమా నుంచి తొలగించారు. అతడి ప్రవర్తన బాగోలేదనే మూవీలో నుంచి తీసేశామని చిత్ర సహ నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, మా సినిమా నుంచి విజయ్ రాజ్‌ను తీసేశాం.
అది సరిపోదట!
అతడికి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా అతడి కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత డబ్బు తీసుకోరు. యూకేలో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అది తనకు సరిపోదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్ కావాలన్నాడు.
నేనేమీ అడుక్కోలేదు
అంతే కాకుండా.. ఈ సినిమాలో యాక్ట్ చేయమని మీరు నన్ను సంప్రదించారు. ఛాన్సివ్వమని నేనేమీ మిమ్మల్ని అడుక్కోలేదు అంటూ రూడ్‌గా మాట్లాడాడు' అని చెప్పుకొచ్చాడు. మరోవైపు సెట్‌లో అజయ్ దేవ్‌గణ్‌ను పలకరించలేదనే తనను తప్పించారని విజయ్ ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment