బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్, నిర్మాత అజయ్ దేవగన్ కలయికతో వచ్చిన మేజర్ సాబ్, ఖాఖీ, సత్యాగ్రహ సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వెండితెరపై ఈ ఇద్దరి కలయిక కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే సత్యాగ్రహ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని ఆశించిన సినీ ప్రేమికులకు నిరాశే మిగిలింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ అగ్ర హీరోలిద్దరు మరో కేజ్రీ ప్రాజెక్టు చేయబోతున్నారు. అయితే సినిమాలో మరో స్పెషల్ కూడా ఉంది. ఈ మూవీలో అజయ్ దేవగన్ అమితాబ్‌తో కలిసి నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు.
(చదవండి : హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట)
ఈ మూవీ టైటిల్ మేడేగా నిర్ణయిచారు. ఈ మూవీ డిసెంబర్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో అజయ్ పైలట్‌గా కనిపించనున్నాడు. ఇక అమితాబ్ పాత్ర ఏంటో ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రస్తుతం అజయ్ ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు మరో ఏడు సినిమాల్లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఆయన హీరోగా నటిస్తున్న ‘భుజ్’, మైదాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అమితాబ్ సినిమా షూటింగ్‌తో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతి షో షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment