చార్‌ జోర్‌  | Maidaan: Ajay Devgns sports drama finally gets a release date | Sakshi
Sakshi News home page

చార్‌ జోర్‌ 

Published Mon, Jan 22 2024 3:53 AM | Last Updated on Mon, Jan 22 2024 3:53 AM

Maidaan: Ajay Devgns sports drama finally gets a release date - Sakshi

ఈ ఏడాది అజయ్‌ దేవగన్‌ ఫుల్‌ రైజింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘సింగమ్‌ ఎగైన్‌’, ‘రైడ్‌ 2’, ‘సైతాన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘సైతాన్‌’ మార్చి 8న, ‘సింగమ్‌ ఎగైన్‌’ ఆగస్టు 15న, ‘రైడ్‌ 2’ నవంబరు 15న రిలీజ్‌ కానున్నాయి. అలాగే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అజయ్‌ దేవగన్‌ ‘మైదాన్‌’ కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఇండియన్‌ మాజీ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్‌’ సినిమాకు అమిత్‌ శర్మ దర్శకత్వం వహించారు.

జీ స్టూడియోస్, బోనీ కపూర్‌ నిర్మించిన ఈ సినిమాను 2022లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ‘మైదాన్‌’ను ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ వెల్లడించింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది అజయ్‌ దేవగన్‌ చిత్రాలు 4 వెండితెరకు వస్తాయి. అంటే.. చార్‌ (నాలుగు) సినిమాలతో అజయ్‌ దేవగన్‌ ఈ ఏడాది ఫుల్‌ జోర్‌ అన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement