మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటివరకు రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మాత్రం పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. గత నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ 'మైదాన్'. హైదరాబాద్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. దాదాపు నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కొన్నిరోజుల క్రితం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా)
Comments
Please login to add a commentAdd a comment