స్టార్ హీరో నటించిన ఈ సినిమాని ఏళ్ల పాటు తీశారు. పడుతూ లేస్తూ షూటింగ్ పూర్తి చేసిన ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకొచ్చారు. బయోపిక్స్ బోర్ కొట్టడం వల్లనో ఏమో గానీ మూవీ బాగున్నా సరే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'. హైదరాబాద్‌కి ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. చాలా ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీని ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. కాకపోతే రెంట్ (అద్దె) విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)
Comments
Please login to add a commentAdd a comment