Maidaan movie
-
ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్
రెండు వారాల క్రితం రిలీజైన 'కల్కి'.. ఇంకా థియేటర్లలో రచ్చ లేపుతూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. మరోవైపు ఈ వారం 'భారతీయుడు 2' లాంటి పాన్ ఇండియా థియేటర్లలోకి వస్తోంది. వీటి గురించి పక్కనబెడితే ఓటీటీలోనూ పలు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాంటిది సడన్‌గా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు)బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేసిన 'మైదాన్'.. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చినప్పటికీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి తెచ్చారు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ అబ్దుల రహీం అనే వ్యక్తి జీవిత కథే ఈ సినిమా. 1952లో హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. దీంతో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) జట్టుకి అండగా నిలబడతాడు. ఓటమికి పొరపాట్లు తెలుసుకుని జట్టుని తిరిగి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?) -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్
మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటివరకు రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మాత్రం పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. గత నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ 'మైదాన్'. హైదరాబాద్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. దాదాపు నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కొన్నిరోజుల క్రితం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ హీరో నటించిన ఈ సినిమాని ఏళ్ల పాటు తీశారు. పడుతూ లేస్తూ షూటింగ్ పూర్తి చేసిన ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకొచ్చారు. బయోపిక్స్ బోర్ కొట్టడం వల్లనో ఏమో గానీ మూవీ బాగున్నా సరే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'. హైదరాబాద్‌కి ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. చాలా ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీని ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. కాకపోతే రెంట్ (అద్దె) విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్‌ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?) -
ఒకప్పటిలా లేదు.. అందుకే కీర్తిసురేశ్‌కు నో ఛాన్స్!
అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మైదాన్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అజయ్ నటించిన షైతాన్ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో మైదాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్గా నటించింది. ఫస్ట్ చాయిస్ ప్రియమణి కాదు అయితే హీరోయిన్ పాత్రకు ముందుగా ప్రియమణిని అనుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ అమిత్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రహీం(హీరో పాత్ర పేరు) భార్యగా కీర్తి సురేశ్‌ను అనుకున్నాను. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆమె చాలా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయింది. అలా సన్నగా ఉంటే తను పాత్రకు సెట్టవదని మిగతావారి దగ్గరకు వెళ్లాను. అలా ఈ పాత్ర ప్రియమణిని వరించింది అని చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ ఫైట్ మైదాన్ రిలీజ్ రోజే అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల మల్టీస్టారర్ బడే మియా చోటే మియా రిలీజ్ కానుంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి! ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళ హిట్ మూవీ తేరి హిందీ రీమేక్ 'జాన్ బేబీ'లో నటించనుంది. ఈ చిత్రాన్ని అట్లీ నిర్మిస్తుండగా అతడి అసిస్టెంట్ కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు?.. ఆనంద్ మహీంద్రా ఆన్సరిదే! -
చార్ జోర్
ఈ ఏడాది అజయ్ దేవగన్ ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘సింగమ్ ఎగైన్’, ‘రైడ్ 2’, ‘సైతాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘సైతాన్’ మార్చి 8న, ‘సింగమ్ ఎగైన్’ ఆగస్టు 15న, ‘రైడ్ 2’ నవంబరు 15న రిలీజ్ కానున్నాయి. అలాగే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అజయ్ దేవగన్ ‘మైదాన్’ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇండియన్ మాజీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను 2022లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ‘మైదాన్’ను ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది అజయ్ దేవగన్ చిత్రాలు 4 వెండితెరకు వస్తాయి. అంటే.. చార్ (నాలుగు) సినిమాలతో అజయ్ దేవగన్ ఈ ఏడాది ఫుల్ జోర్ అన్నమాట. -
కోట్ల బడ్జెట్.. రిలీజ్‌కు నోచుకొని స్టార్ హీరో సినిమా!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్‌కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్‌కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్‌కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. మూడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఆర్ఆర్ఆర్తో పోటీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా, బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. రిలీజ్ కష్టమేనా బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో మైదాన్ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్‌డౌన్‌తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్‌లోకి రావడం కష్టమే.