
అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మైదాన్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అజయ్ నటించిన షైతాన్ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో మైదాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.
ఫస్ట్ చాయిస్ ప్రియమణి కాదు
అయితే హీరోయిన్ పాత్రకు ముందుగా ప్రియమణిని అనుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ అమిత్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రహీం(హీరో పాత్ర పేరు) భార్యగా కీర్తి సురేశ్‌ను అనుకున్నాను. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆమె చాలా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయింది. అలా సన్నగా ఉంటే తను పాత్రకు సెట్టవదని మిగతావారి దగ్గరకు వెళ్లాను. అలా ఈ పాత్ర ప్రియమణిని వరించింది అని చెప్పుకొచ్చాడు.
బాక్సాఫీస్ ఫైట్
మైదాన్ రిలీజ్ రోజే అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల మల్టీస్టారర్ బడే మియా చోటే మియా రిలీజ్ కానుంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి! ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళ హిట్ మూవీ తేరి హిందీ రీమేక్ 'జాన్ బేబీ'లో నటించనుంది. ఈ చిత్రాన్ని అట్లీ నిర్మిస్తుండగా అతడి అసిస్టెంట్ కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
చదవండి: సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు?.. ఆనంద్ మహీంద్రా ఆన్సరిదే!
Comments
Please login to add a commentAdd a comment