రెండు వారాల క్రితం రిలీజైన 'కల్కి'.. ఇంకా థియేటర్లలో రచ్చ లేపుతూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. మరోవైపు ఈ వారం 'భారతీయుడు 2' లాంటి పాన్ ఇండియా థియేటర్లలోకి వస్తోంది. వీటి గురించి పక్కనబెడితే ఓటీటీలోనూ పలు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాంటిది సడన్‌గా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: 'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు)
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేసిన 'మైదాన్'.. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చినప్పటికీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి తెచ్చారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ అబ్దుల రహీం అనే వ్యక్తి జీవిత కథే ఈ సినిమా. 1952లో హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. దీంతో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) జట్టుకి అండగా నిలబడతాడు. ఓటమికి పొరపాట్లు తెలుసుకుని జట్టుని తిరిగి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment