బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఇప్పటివరకు 100కు పైనే సినిమాలు చేశాడు. ఇన్నేళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అయినా సరే.. తనకు నటన రాదు, ఫేస్‌లో ఓ ఎక్స్‌ప్రెషన్ అర్థం కాదు అని కొందరు నెటిజన్లు తనను విమర్శిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీలు ఎవరున్నారని..? అలా ఆర్‌ఆర్‌ఆర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సైతం ఈ ట్రోలింగ్ బాధితుడే!
అందుకే నో స్టార్‌డమ్
తాజాగా ఓ వ్యక్తి ఈ హీరోపై ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఈ జెనరేషన్‌లో చెత్త నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది అజయ్ దేవ్‌గణ్. సరిగా ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వలేడు.. అందుకే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లా స్టార్‌డమ్ అందుకోలేకపోయాడు. ఆఖరికి అక్షయ్ కుమార్ అంత పాపులారిటీ కూడా తెచ్చుకోలేకపోయాడు అంటూ అజయ్ నటించిన కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ జత చేశాడు.
నాలుగు జాతీయ అవార్డులు
ఇది చూసిన అభిమానులు తమ హీరో గొప్పవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తను చాలా బాగా నటిస్తాడు. సింగం, దృశ్యం, షైతాన్ సినిమాల్లో తన యాక్టింగ్ అయితే ఇంకా బాగుంటుంది, నాలుగుసార్లు జాతీయ అవార్డు వచ్చిందంటేనే అర్థమవుతోంది తను యాక్టింగ్‌లో అందరికంటే గొప్పవాడని.. ఏదో కొన్ని పాత్రలు సేమ్ ఉన్నప్పుడు తన యాక్టింగ్‌లో పెద్ద తేడా కనిపించలేదంతే!
అందుకేనేమో..
అజయ్ గొప్ప నటుడు.. కానీ ఈ కాలం పిల్లలకు ఇది అస్సలు అర్థమవట్లేదు, చాలామంది మగవాళ్లు నిజజీవితంలో తమ భావాలను బయటకు కనిపించనీయరు. అందుకే కొన్నిసార్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చీఇవ్వనట్లున్నారు అని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా అజయ్ దేవ్‌గణ్ 1991లో ఫూల్ ఔర్ కంటే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.
సినిమాలు..
కచ్చే ఢాగె, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, ఓంకార, గోల్‌మాల్, సింగమ్, మైదాన్.. ఇలా అనేక చిత్రాలతో అలరించాడు. జకం, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా తానాజీ చిత్రానికి(నటుడిగా, నిర్మాతగా) రెండు జాతీయ పురస్కారాలు గెలుచుకున్నాడు.
Ajay devgn got to be the worst actor from his generation with no aura thats why he didn't reach real stardom like the khans or even akshay kumar pic.twitter.com/fOkrIGHBRY
— cali. (@mastanified) July 7, 2024
Comments
Please login to add a commentAdd a comment