
అజయ్ దేవగన్
సాక్షి, ముంబై: లాక్‌డైన్ వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంతమంది తమలో ఉన్న కళలను మెరుగు పరుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను, పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిసున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ దేవగన్ ఓ త్రోబ్యాక్(పాత ఫొటో)ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది అజయ్ దేవగన్, తన భర్య హీరోయిన్ కాజోల్ ఓ సినిమా షూటింగ్ సమయంలో దిగారు. ‘నాకు లాక్‌డౌన్ ప్రారంభమైన 20 ఏళ్లు అయినట్టు అనిపిస్తుంది’ అని అజయ్ దేవగన్ సరదాగా కామెంట్ జతచేసి కాజోల్‌ను ట్యాగ్ చేశారు. (అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్)
‘హల్చుల్’ సినిమా చిత్రీకరణలో కలుసుకున్న కాజోల్, అజయ్ 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరూ గుండరాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజు చాచా, ప్యార్‌తో హోనా హి థా పలు సినిమాల్లో నటించారు. ఈ జంటకి 2003లో కుమార్తె నైసా, 2010లో కుమారుడు యుగ్ జన్మించారు.
ది బిగ్ బుల్, మైదాన్, సూర్యవంశీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు మరో రెండు చిత్రాల్లో ఆజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పలు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదేవిధంగా చివరగా ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాలో అజయ్ దేవ్‌గన్ కనిపించారు. కాజోల్ చివరగా ప్రియాంక బెనర్జీ షార్టుఫిల్మ్ ‘దేవి’లో కనిపించారు. అదేవిధంగా ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాలో సావిత్రిబాయి మలుసారే పాత్రలో కాజోల్ అజయ్‌దేవగన్‌కి భార్యగా నటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment