హీరో ర్యాలీలో అభిమానుల వీరంగం
పట్నా: బిహార్ అంసెబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ పాల్గొనాల్సిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో అభిమానులతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు.
మంగళవారం బిహార్ షరీఫ్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభకు అజయ్ వస్తారని ప్రచారం చేయడంతో ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన అజయ్ మధ్యాహ్నం 1 గంటల వరకు రాలేదు. దీంతో అభిమానులు బారికేడ్లు దూకి వీరంగం చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయగా.. అల్లరి మూకలు రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఈ సమయంలో అజయ్ దేవగన్, ఇతర బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. అయితే ల్యాండ్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. గ్రౌండ్లో పరిస్థితులు అనుకూలించలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున అజయ్ దేవగన్ ప్రచారం చేస్తున్నారు. జముయ్, లఖిసరాయ్, నవాడ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు.