‘అందుకే నా సినిమాలో అలాంటి సీన్లు ఉండవు’ | Ajay Devgn Reveals Why He Avoids Kissing On Screen | Sakshi
Sakshi News home page

కుటుంబంతో కలిసి చూసేలా ఉండాలి : అజయ్‌ దేవగణ్‌

Published Sat, May 11 2019 6:04 PM | Last Updated on Sat, May 11 2019 6:08 PM

Ajay Devgn Reveals Why He Avoids Kissing On Screen - Sakshi

ఓ సినిమా విజయం సాధించాలంటే కథతో సంబంధం లేకుండా బోలేడన్ని ముద్దు సన్నివేశాలు.. మితిమీరిన అశ్లీలత ఉంటే చాలనుకునే రోజులివి. ప్రస్తుతం ఈ దరిద్రం అన్ని ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తుంది. కానీ తాను మాత్రం ముద్దు, అసభ్యకర సన్నివేశాలుండే చిత్రాలను అసలు ఒప్పుకోనంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌. ఈ విషయం గురించి ఆయన స్పందిస్తూ.. ‘ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని నేను కథలను ఎంచుకుంటాను. ఎందుకంటే నేను కూడా నా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూస్తాను. అలానే ప్రేక్షకులు కూడా కుటుంబంతో కలిసి సినిమా ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటాను. అలాంటిది ఫ్యామిలితో.. ముఖ్యంగా పిల్లలతో సినిమా చూడ్డానికి వచ్చినప్పుడు స్క్రీన్‌ మీద ముద్దు, అశ్లీల దృశ్యాలు వస్తే ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. అందుకే నేను ఇలాంటి సన్నివేశాలు డిమాండ్‌ చేసే సినిమాలు ఒప్పుకోను’ అని తెలిపారు అజయ్‌.

అయితే శివాయ్‌ సినిమాలో మాత్రం అజయ్‌ ఈ రూల్‌ని బ్రేక్‌ చేశారు అజయ్‌. దీని గురించి ఆయన వివరణ ఇస్తూ.. ‘ ఆ సినిమాలో లవ్‌ సీన్‌ కోసం అలా చేయాల్సి వచ్చింది. అయితే అది బలవంతంగా సినిమాలో ఇరికించిన సీన్‌ కాదు. కానీ నేటి సినిమాల్లో ఇలాంటి సీన్లు కావాలనే పెడుతున్నారు. కథ బలంగా ఉంటే ఇవేవి అక్కర్లేద’ని తెలిపారు అజయ్‌. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌దే’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అజయ్‌. అక్వి అలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు అజయ్‌కు జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 17 విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement