
అజయ్‌దేవగన్‌కు మాలధారణ చేస్తున్న వెంకటరెడ్డి
గుంటూరు ఈస్ట్: బాలివుడ్ హీరో అజయ్‌దేవగన్‌కు ఇటీవల ముంబైలో అయ్యప్ప మాలధారణ చేసినట్లు గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన గురుస్వామి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి ఆదివారం చెప్పారు. ప్రముఖ తెలుగు ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి ద్వారా మాలధారణ ఉపదేశం ఇచ్చే అవకాశం తనకి లభించినట్లు తెలిపారు.
అజయ్‌దేవగన్ అయ్యప్ప స్వామి పరమ భక్తుడని, నిష్టతో దీక్ష చేయాలనే లక్ష్యంతో మాలధారణ స్వీకరించారన్నారు. అజయ్‌దేవగన్‌తో పాటు మరో ఐదుగురికి మాలధారణతో ఉపదేశం ఇచ్చినట్లు వెంకటరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment