దీన్ని సెల్ఫీ అంటారా? | Ajay Devgn Version Of Selfie Leaves Kajol Amused | Sakshi
Sakshi News home page

కాజోల్‌ను ఆటపట్టించిన అజయ్‌

Published Tue, Feb 25 2020 3:04 PM | Last Updated on Tue, Feb 25 2020 3:25 PM

Ajay Devgn Version Of Selfie Leaves Kajol Amused - Sakshi

బాలీవుడ్‌ కపుల్‌ అజయ్‌ దేవ్‌గన్‌, కాజోల్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ ఒకరిపై మరొకరు అవాక్కులు చవాక్కులు పేల్చుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక వీరిద్దరూ కలిసి దాదాపు పదేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఇది బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. కాగా సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో కాజోల్‌ భర్తను సెల్ఫీ తీయమని అడిగింది. భార్య అడిగాక భర్త కాదంటాడా? ఓస్‌.. అదెంత పని అంటూ అజయ్‌ ఫోన్‌ చేతిలోకి తీసుకుని.. సతీమణిని మెట్లపై కూర్చోమన్నాడు.(కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం: కాజోల్‌)

వెంటనే కాజోల్‌ హుషారుగా వెళ్లి మెట్లపై కూర్చుని ఫొటోకు పోజిచ్చింది. తీరా అజయ్‌.. భార్యను మాత్రమే క్లిక్‌మనిపించాడు. దీంతో బుంగమూతి పెట్టిన కాజోల్‌ ‘సెల్ఫీ అంటే నన్ను ఒక్కదాన్నే తీయమని కాదు.. మనమిద్దరం కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం’ అని క్లాస్‌ పీకింది. ఇక ఈ  విషయాన్ని ఫొటోతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకిచ్చింది. వీరి చిలిపి చేష్టలకు అభిమానులు స్పందిస్తూ ‘ఫొటోలో కనిపించకపోతేనేం.. నీ కళ్లలో కనిపిస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా అని అజయ్‌కు సెల్ఫీ తీయడం రాదేమోనని తేలికగా తీసిపారేయకండి. పండుగలు, పబ్బాలు, ఫ్యామిలీ ట్రిప్‌.. ఇలా చాలాసార్లు అతనూ సెల్ఫీలు క్లిక్‌మనిపించాడు. కాగా వీళ్లిద్దరూ నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం పెద్దల అంగీకారంతో 1999లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నైసా, యగ్‌ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (‘మైదాన్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement