
మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. పైగా ఇద్దరు లేదా అంతకుమించిన స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపిస్తున్నారంటే వారి అభిమానులకు పండగే. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా గురించి ప్రేక్షకులు గతేడాది నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల ఆలస్యం కానుందనే వార్త అందరినీ నిరాశకు గురి చేసింది. కానీ వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.
అందుకు తగ్గట్టుగానే సినిమాలోని కీలక సన్నివేశాల్ని శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవ్‌గన్ మంగళవారం షూటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు జక్కన్నతో కలిసి దిగిన ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేటి నుంచి అజయ్‌పై చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి:
ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ మారిందా?
Comments
Please login to add a commentAdd a comment