అజయ్ దేవగణ్‌‌ బర్త్‌డే: ఆసక్తికర విషయం చెప్పిన కాజోల్‌‌‌‌ | Kajol Funny Birthday Wishes To Husband Ajay Devgn | Sakshi
Sakshi News home page

భర్తకు తనదైన శైలిలో బర్త్‌డే విషెస్‌ చెప్పిన కాజోల్

Published Fri, Apr 2 2021 8:47 PM | Last Updated on Fri, Apr 2 2021 9:01 PM

Kajol Funny Birthday Wishes To Husband Ajay Devgn - Sakshi

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్‌ నేటితో 52వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు (ఏప్రీల్‌ 2) ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా  సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు దేవగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయన భార్య, నటి కాజోల్‌ బర్త్‌డే విషెష్‌ మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. అజయ్‌ తనదైన శైలిలో చమత్కిరిస్తు శుభాకాంక్షలు తెలిపిన కాజోల్‌ తీరు నెటిజన్లను, అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

అజయ్‌ కెమెరాతో ఉన్న ఓ ఫొటోలను షేర్‌ చేశారు. అంతేగాక అజయ్‌ అంత్యంత సంతోష పెట్టె విషయం ఏంటో కూడా వెల్లడించారు.‘సెల్ఫీ తీయాలని చూశాను. కానీ ఈ సెల్ఫీలో కేవలం ఆ కెమెరాతో ఆయనను మాత్రమే సెల్ఫ్‌ చేయగలిగాను. రోల్‌ కెమెరా.. ఏం చేస్తున్నారో అదే ఆయనను సంతోష పెట్టే విషయం. హ్యాపీ బర్త్‌డే ఇప్పటికి.. ఎప్పటికి’ అంటూ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేసి ట్వీట్‌ చేశారు కాజోల్‌. దీని అజయ్‌ ‘త్వరలోనే మనం ఇద్దరం కలిసి లాంగ్‌ ఓవర్‌ డ్యూ సెల్ఫీ తీసుకుందాం’ అంటూ చమత్కరించాడు.

కాగా హీరో అభిషేక్‌ బచ్చన్‌, సునీల్‌ శెట్టి, నటి మాధురి దీక్షిత్‌లు కూడా అజయ్‌ దేవగణ్‌‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేగాక ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని అజయ్‌ ఫస్ట్‌లుక్‌ను‌ చిత్ర యూనిట్‌ విడుదల చేసి అభమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. జూనియర్‌ ఎన్టీర్‌, రాంచరణ్‌లు హీరోలుగా ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: 
అజయ్‌ దేవగన్‌ మోషన్‌ పోస్ట‌ర్‌ రిలీజ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement