
బాలివుడ్ నటుడు అజయ్ దేవగణ్ పుట్టినరోజు (ఏప్రిల్ 2) సందర్భంగా తను నటించిన కొత్త చిత్రం 'మైదాన్' ట్రైలర్ విడుదల చేశారు. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫుట్‌బాల్ కోచ్‌గా ఆయన నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు కావచ్చు.. ఒక్కసారి ఆట బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ వ్యూహం.. ఒకేలా ఉండాలి. అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది.
భారత ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మైదాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. అబ్దుల్ రహీమ్ సతీమణిగా ప్రియమణి కనిపించారు. జీ స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మనసుని హత్తుకునేలా అమిత్ శర్మ దీనిని తీర్చిదిద్దారన్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment