
సెన్సెక్స్, స్టాక్ ఎక్సేంజ్, స్టాక్ బ్రోకింగ్ గురించి నాలెడ్జ్ సంపాదించి బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో వర్క్ స్టార్ట్ చేశారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. కానీ అభిషేక్ ఈ పని చేస్తోంది మాత్రం ‘ది బిగ్ బుల్’ సినిమా కోసమే. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నారు. 2012లో ‘బోల్ బచ్చన్ ’సినిమా కోసం అభిషేక్, అజయ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది బిగ్ బుల్’ సినిమాకు కూకై గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. చిత్రీకరణ ప్రారంభమైంది. ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న ముంబై ప్రముఖ స్టాక్ బ్రోకర్ హార్షద్ మెహతా (1954–2001) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం.