![Anant Ambani Visits Akshay Kumar, Ajay Devgn's Residence To Invite For His Wedding With Radhika Merchant](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/27/anant.jpg.webp?itok=s0FBVwxh)
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుండగా ఈ శుభాకార్యానికి రావాలంటూ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే పెళ్లి పత్రికను పొందుపరిచారు.
తాజాగా అనంత్ అంబానీ.. తమ పెళ్లికి రావాలంటూ ఇద్దరు హీరోల ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అక్షయ్‌కు స్వయంగా కార్డు ఇచ్చి కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అలాగే అక్షయ్ దేవ్‌గణ్‌ను సైతం కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment