
తాన్హాజీ అనే చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ‘మైదాన్’ అనే సినిమా చేస్తున్నారు.ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా ‘మైదాన్’ సినిమా రూపొందుతుంది. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ ఫుల్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. ఫుట్ బాల్ కోచ్‌గా అజయ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భారత్. ఆ సమయంలో ఆ జట్టుకి కోచ్‌గా సయ్యద్ అబ్ధుల్ రహీం ఉన్నారు. ఆయన జీవితాన్ని ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 27న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు ప్రపంచవాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment