
‘‘కాజోల్, నైసా గురించి అడుగుతున్న అందరికీ ధన్యవాదాలు. వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు’’ అన్నారు అజయ్ దేవగన్. అసలు విషయం ఏంటంటే.. అజయ్–కాజోల్‌ల కుమార్తె నైసా సింగపూర్‌లో చదువుకుంటోంది. కుమార్తెను చూడడానికి కాజోల్ ఆ మధ్య సింగపూర్ వెళ్లారు. చదువు పూర్తి కావడంతో కుమార్తెను తీసుకుని ఇండియా వచ్చారామె. అయితే కాజోల్, నైసాకి కరోనా సోకిందనే వార్తలు మొదలయ్యాయి. ‘‘ఆ వార్తలు నిజం కాదు. మా ఫ్యామిలీలో అందరి ఆరోగ్యం బాగుంది’’ అని స్పష్టం చేశారు అజయ్ దేవగన్.