
మా ఆయన నిర్ణయం కరెక్టే: హీరోయిన్
పాక్ నటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించడాన్ని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సమర్థించారు.
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్లో పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించడంపై బాలీవుడ్ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. పాక్ నటులపై నిషేధం విధించడాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరి కొందరు తప్పుపడుతున్నారు. నటులను కళాకారులుగా చూడాలని, వాళ్లు ఉగ్రవాదులు కాదంటూ వ్యాఖ్యానించారు.
పాక్ నటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించడాన్ని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సమర్థించారు. ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నంత వరకూ సాంస్కృతిక సంబంధాలు ఉండరాదని వ్యాఖ్యానించారు. పాక్లో తన సినిమాలు విడుదల కాకున్నా పట్టించుకోనని, కళాకారులు దేశానికి మద్దతుగా ఉండాలని అజయ్ చెప్పారు. ఈ విషయంపై అజయ్ భార్య, నటి కాజోల్ స్పందిస్తూ.. తన భర్త సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అజయ్ తీసుకున్న వైఖరిని సమర్థిస్తున్నానని, ఇందుకు గర్విస్తున్నానని కాజోల్ ట్వీట్ చేశారు.