![Ajay Devgn To Khaidi Movie Remake Bollywood Talk - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/26/ajay.jpg.webp?itok=2wCtGWZm)
గత ఏడాది దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రం ‘ఖైదీ’. ఖైదీ పాత్రలో కార్తీ కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో యస్‌ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు నిర్మాత ప్రభు. నటీనటుల వివరాలు మాత్రం ప్రకటించలేదు. ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.
Comments
Please login to add a commentAdd a comment