Khaidi Movie
-
డిల్లీతో రోలెక్స్
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్‌ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. -
'ఖైదీ' సీక్వెల్‌పై లోకేశ్ కనకరాజ్ ట్వీట్
ఖైదీ–2 చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన కెరియర్లో రెండో చిత్రంగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విశేషం ఏమిటంటే..? ఈ చిత్రంలో కథానాయకి లేదు, డ్యూయెట్లు ఉండవు, ఇంకా చెప్పాలంటే అసలు గ్లామర్ వాసన లేని చిత్రం ఖైదీ. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి నటన హైలెట్. ఖైదీ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని అటు దర్శకుడు లోకేశ్ కనకరాజ్, ఇటు కార్తి చెబుతూనే ఉన్నారు. దీంతో ఖైదీ–2 చిత్రం కోసం కార్తి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ చిత్రం విడుదలై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పోస్ట్చేస్తూ.. ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తి, ఎస్ఆర్ ప్రభులకు ధన్యవాదాలు. వీరి వల్లే లోకేశ్ యూనివర్శల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్త్తి పాత్ర పేరు) తిరిగి రానున్నారు అని పేర్కొన్నారు. అలా ఆయన త్వరలోనే ఖైదీ–2 చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్తి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఖైదీ–2కు సిద్ధమయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. It all started from here! 💥💥Grateful to @Karthi_Offl sir, @prabhu_sr sir and the ‘universe’ for making this happen 🤗❤️Dilli will return soon 🔥#5YearsOfKaithi pic.twitter.com/Jl8VBkKCju— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024 -
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
ఖైదీ తిరిగొస్తున్నాడోచ్..! గుడ్ న్యూస్ చెప్పిన కార్తీ
-
ఆ చిత్రం నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’. 1983లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది. హాలీవుడ్ చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచలనాలు సృష్టించింది. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూలు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీలో చిరంజీవి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత చిరంజీవికి వరుస సినిమాలు వచ్చాయి. కెరీర్లో ఎన్ని సూపర్ హిట్స్ వచ్చిన చిరంజీవికి ఖైదీ ఎప్పుడూ స్పెషల్ చిత్రమే . ఈ మూవీ విడుదలైన నేటికి 40 ఏళ్లు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విటర్)లో స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ‘'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు. చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH — Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023 -
సర్ధార్‌తో పాటు ఢిల్లీ ఎప్పుడు వస్తారంటే..
నటనకు విరామం లేకుండా దూసుకుపోతున్న నటుడు కార్తీ. 2007లో తన తొలి చిత్రం పరుత్తివీరన్తోనే ఛాలెంజ్‌తో కూడిన పాత్రతో కథానాకుడిగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఇటీవల నటించిన సర్ధార్ చిత్రం వరకు ఈయన నటనా జర్నీ చూస్తే 99 శాతం విజయాలే. ప్రస్తుతం 'జపాన్' అనే మరో వైవిధ్యమైన పాత్రతో తన విలక్షణ నటనతో దీపావళి పండుగకు సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ది వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇది కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం తన 26వ చిత్రాన్ని నలన్ కుమారసామి దర్శకత్వంలో చేస్తున్న కార్తీ.. మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు ఆయనచేతిలో ఉన్నాయి. అందులో సర్ధార్ –2, ఖైదీ 2 చిత్రాలు ముఖ్యమైనవి. కాగా ఖైదీ 2 చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల అధికారికంగానే చెప్పారు. రజనీకాంత్‌తో చేసే చిత్రం తరువాత ఖైదీ 2 మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ రకంగా ఢిల్లీని (ఖైదీలో కార్తీ పేరు) చూడాలాంటే 2025 వరకు ఆగాల్సిందే. కాగా తాజాగా సర్ధార్ 2 చిత్రం గురించి నటుడు కార్తీ అప్ డేట్ ఇచ్చారు. ఆయన తన ఇన్ స్ట్రాగామ్‌లో సర్ధార్ చిత్రం విడుదలై ఏడాది పూర్తి అయ్యిందని, త్వరలో సర్ధార్ – 2కు రెడీ అవుతున్నట్లు కార్తీ పేర్కొన్నారు. కాగా సర్ధార్ చిత్రాన్ని రూపొందించిన ప్రినన్స్ పిక్చర్స్ సంస్థనే దాని సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఖైదీ - 2
-
మరోసారి మెగాఫోన్ పట్టిన బాలీవుడ్ స్టార్ హీరో
కెరీర్లో నాలుగోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ ఫిల్మ్ ‘ఖైదీ’ (2019) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు ధర్మేంద్ర శర్మను దర్శకుడిగా అనుకున్నారు. షూటింగ్ కూడా ఆరంభించారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్‌లో అదరగొట్టేసిన చిరంజీవి) అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బోళ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఇక ‘యు మీ ఔర్ హమ్’ (2008), ‘శివాయ్’ (2016), ‘రన్ వే 34’ (2022) చిత్రాల తర్వాత అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘బోళ’యే కావడం విశేషం. -
సూర్య వర్సెస్ కార్తి.. ఖైదీ సీక్వెల్ కు లైన్ క్లియర్
కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి కలసి నటిస్తే చూడాలని చాలా కాలంగా సౌత్ ఇండియా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురు చూపులు ఫలించాయి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ క్లైమాక్స్ లో ఖైదీ 2కు సంబంధించిన అఫీసియల్ లీడ్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. అంతేకాదు సీక్వెల్ స్టోరీని కూడా కొంత లీక్ చేసాడు. ఈ సిక్వెల్‌ని అన్నదమ్ముల సవాల్‌గా మార్చాడు లోకేష్. ఖైదీ సీక్వెల్లో విలన్‌గా సూర్య, హీరోగా కార్తి నటించబోతున్నారు. వీరికి తోడు కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ చేస్తే.. ఖైదీ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. (చదవండి: ‘విక్రమ్’ మూవీ రివ్యూ) అయితే ఇప్పటికిప్పుడు ఖైదీ2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. సూర్య, కార్తిల మధ్య యుద్దం మొదలవడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేతి నిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో వైపు లోకేష్ కూడా ఇప్పట్లో ఈ సీక్వెల్‌ని తెరకెక్కించే అవకాశం లేదు. త్వరలోనే ఆయన హీరో విజయ్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాతే వీరు ముగ్గరు ఖైదీ 2తో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఖైదీ దొరికాడా?
గత ఏడాది దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రం ‘ఖైదీ’. ఖైదీ పాత్రలో కార్తీ కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో యస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు నిర్మాత ప్రభు. నటీనటుల వివరాలు మాత్రం ప్రకటించలేదు. ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. -
పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు
పాటలు, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన కార్తీ తాజా చిత్రం ‘ఖైదీ’. రెగ్యూలర్ సినిమాలకు భిన్నంగా రూపొందిన ఈ సినిమా హిట్‌గా నిలవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సైతం ‘ఖైదీ’పై ప్రశంసల వర్షం కురిపించాడు. సరికొత్తగా తెరకెక్కుతున్న నవ యుగపు సినిమాలకు ఖైదీని ఉదాహరణగా పేర్కొన్న ప్రిన్స్... పాటల్లేకుండానే గ్రిప్పింగ్ స్క్రిప్టుతో ప్రేక్షకులను కట్టిపడేసిందని కొనియాడాడు. ఇది ఆహ్వానించదగ్గ మార్పు అంటూ ఖైదీ టీంను ట్విటర్ వేదికగా అభినందించాడు.(చదవండి : ఖైదీ సినిమా ఎలా ఉందంటే..) కాగా దర్శకుడు అవ్వాలన్న కోరికతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీ... యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకీ సినిమాలతో కోలీవుడ్‌లో హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల కావడంతో టాలీవుడ్లో కూడా కార్తీకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక కింగ్ నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించిన కార్తి.. గత శుక్రవారం ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ విడుదల చేశారు. Khaidi... new age filmmaking...thrilling action sequences and stellar performances in a gripping script... no songs!! A welcome change :) Congratulations to the entire team @Karthi_Offl @itsNarain @sathyaDP @SamCSmusic @DreamWarriorpic and @Dir_Lokesh !! 👍👍👍👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2019 -
ఖైదీకి సీక్వెల్ ఉంది
చెన్నై : ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు కార్తీ తెలిపారు. ఈయన మానగరం చిత్రం ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఖైదీ. డ్రీమ్ వారియర్స్ ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు, వివేకానంద ఫిలింస్ తిరుపూర్ వివేక్‌లు కలిసి నిర్మించిన చిత్రం ఖైదీ.హీరోయిన్, పాటలు, ప్రేమ సన్నివేశాలు లేని యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం ఇది. ఇందులో లారీడ్రైవర్‌గా నటించిన హీరో కార్తీకి, ఇతర పాత్రధారులకు ధరించిన దుస్తులు మినహా మరో దుస్తులు మార్చే అవకాశం ఉండదు. జైలు జీవితాన్ని అనుభవించి విడుదలైన కార్తీ మాసిన గడ్డం, మీసంతో చిత్రం అంతా కనిపిస్తారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఖైదీ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఆ చిత్ర కథానాయకుడు కార్తీ శనివారం మధ్యాహ్నం మీడియాతో తనఆనందాన్ని పంచుకున్నారు. ఒక కొత్త ప్రయత్నానికి మంచి విజయం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడానికి తానెప్పుడూ రెడీ అన్నారు. చిత్ర విజయానికి సమష్టి కృషే కారణం అన్నారు. ప్రతి చిత్రం తనకు మంచి అనుభంగా పేర్కొన్నారు. ఏదో ఒక విషయాన్నితెలుసుకోవడమో, నేర్చుకోవడమో జరుగుతుందన్నారు. ఈ ఖైదీ చిత్రం కోసం లారీని నడిపిన అనుభవం మరచిపోలేనన్నారు. లారీని నడపడానికి ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెప్పారు. వేరే షూటింగ్లో ఉండడంతో అంత సమయం కూడా లేదన్నారు. కనీసం షూటింగ్ ప్రారంభానికి ముందు తను నడపాల్సిన లారీని కూడా చూడలేదనీ, దర్శకుడే లుక్ బాగుందని ఒక లారీని ఎంపిక చేశారని తెలిపారు. దానికి ఇంజిన్, బ్రేకులు లాంటివి కూడా సరిగా లేవన్నారు. అడవిలో రోడ్డుకిరుపక్కల గరుకుగా ఉండే ప్రాంతంలో లారీని నడపడం తనకు సవాల్‌గానే అనిపించిందన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందనీ, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అందుకు కథను కూడా సిద్ధం చేశారని చెప్పారు. ఒక 30 రోజులు కాల్షీట్స్ తనకు కేటాయించమని ఆయన తనను అడిగారని తెలిపారు. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం నటుడు విజయ్ 64వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, అది పూర్తయిన తరువాత ఖైదీ– 2 చిత్రం ప్రారంభం అవుతుందని కార్తీ వెల్లడించారు. -
ఖైదీ మలుపు తిప్పింది
తాడేపల్లిగూడెం : ఆయన కనురెప్పలు కదిపితే నృత్యం. ఆయన అభినయం ఆనందమయం. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో ఆకట్టుకునే స్టెప్పులేయించారు. ఆనాటి నుంచి నిన్నటి బాహుబలి వరకూ 1,400 సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. 45ఏళ్ల సినీపయనంలో ఎన్నో అనుభూతులు.. వాటిని ‘సాక్షి’తో పంచుకున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్. పట్టణంలో శ్రీ డ్యాన్స్ అకాడమీ దశమ వార్షికోత్సవం, బాలల దినోత్సవం కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం నాట్యరత్న బిరుదుతో సత్కారం అందుకోనున్నారు.ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ‘సాక్షి’తో చిట్‌చాట్ చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పుట్టింది మద్రాసులో. నటరాజ్ శంకుంతల వద్ద న్యాట ఆరంగేట్రం. సినీ నృత్యానికి సలీం మాస్టర్ గురువు. కురివికుడు అనే తమిళ సినిమాతో సినీ నృత్యదర్శకత్వానికి శ్రీకారం. తెలుగులో ఖైదీతో ఆరంగేట్రం. ఇది నా తొలి సినీ అడుగులు. ఖైదీలో రగులుతుంది మొగలి పొద పాటకు దర్శకత్వం వహించే అవకాశం అనుకోకుండా దక్కింది. అది నా సినీ నృత్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటితరం నాగశౌర్య వరకూ అందరికీ నృత్య దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. పలు భాషల్లో 1,400 సినిమాలు చేశా. అరుంధతి సినిమాలో కంపోజ్ చేసిన డ్రమ్ డ్యాన్సుకు డాక్టరేట్ వచ్చింది మగధీరలో ధీర..ధీర.. పాటకు జాతీయ అవార్డు వచ్చింది. నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలి నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక. తుది శ్వాసనూ నృత్యం చేస్తుండగానే వదలాలి అనేది ఆకాంక్ష. తమిళ సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తున్నా. సూర్య, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిపి ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నా. కన్నడలో కురుక్షేత్రం సినిమాలో పాత్రపోషిస్తున్నాను. 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలి. సెమీ క్లాసికల్ నృత్యానికి ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నారు. -
‘ఖైదీ’... ఒక ప్రభంజనం
1983... తెలుగు సినిమా ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. ఇదే ఏడాదిలో తెలుగు సినిమాకు చెందిన రెండు అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు ఎన్టీఆర్... ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఎన్టీఆర్ వదిలి వెళ్లిన ‘నంబర్‌వన్’ స్థానాన్ని భర్తీ చేసే నటుడు ఎవరు? అటు ప్రజల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ ఎక్కడ చూసినా అప్పట్లో ఇదే ప్రశ్న. అలాంటి తరుణంలో అదే ఏడాది మరో అద్భుతం జరిగింది. అదే ‘ఖైదీ’. తెలుగుతెరపై మరో తిరుగులేని ప్రస్థానానికి శ్రీకారం చుట్టిందీ సినిమా. ‘ఖైదీ’ అనగానే... ఇప్పటికీ గుర్తొచ్చేది ‘పోలీస్ స్టేషన్ ఫైట్’. ఒక అగంతకుడు... పోలీస్టేషన్లో పోలీసులందరినీ చావబాదడం అనేది అంతకు ముందెన్నడూ తెలుగు ప్రేక్షకుడు చూడలేదు. చిరంజీవి ఆ ఫైట్ చేసిన తీరు... యావత్ ఆంధ్రదేశం నివ్వెరపోయేలా చేసింది. ‘రగులుతోంది.. మొగలి పొద’ పాటలో... చిరంజీవి, మాధవి కలిసి నర్తించిన తీరు ప్రేక్షకుణ్ణి విస్తుపోయేలా చేసింది. డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ మునుపెరగని వేగాన్ని, ఓ విధమైన స్టయిలిష్ పెర్ఫార్మెన్స్నీ తెలుగు తెరకు పరిచయం చేసి కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు చిరంజీవి. అప్పటివరకూ సాధారణ హీరో అయిన చిరంజీవి ‘ఖైదీ’తో సుప్రీంహీరోగా అవతరించారు. చిరంజీవిని రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేసిన ‘ఖైదీ’ విడుదలై నేటికి 30 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి కాసేపు గుర్తు చేసుకుందాం. అప్పటికి చిరంజీవి, ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు న్యాయంకావాలి, కిరాయిరౌడీలు, ప్రేమ పిచ్చోళ్లు, శివుడు శివుడు శివుడు. ఇదే కాంబినేషన్లో సంయుక్త మూవీస్ అధినేతలు కె.తిరుపతిరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డిలు ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కథ తయారు చేసే బాధ్యతను పరుచూరి బ్రదర్స్ చేతిలో పెట్టేశారు నిర్మాతలు. బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’ స్క్రిప్ట్‌ను స్టార్ రైటర్స్ సలీమ్-జావేద్‌లు 18 రోజుల్లో పూర్తి చేశారట. అప్పట్లో అది చాలా గొప్పగా చెప్పుకునేవారు. మరి ‘ఖైదీ’ సినిమాకు సంబంధించిన 56 సన్నివేశాలను పరుచూరి వెంకటేశ్వరరావు ఆరు గంటల్లో రాస్తే, ఆ సన్నివేశాలకు మూడురోజుల్లో సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. మరి వీళ్లను ఎంత గొప్పగా చెప్పుకోవాలి! 1982 జూన్ 16న మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ‘ఖైదీ’ ప్రారంభోత్సవం జరిగింది. కల్యాణి ఫిలింస్ అధినేత ఎం.సుధాకరరెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. ముహూర్త బలమో ఏమో... చకచకా నిర్మాణం పూర్తయింది. ఈ చిత్రానికి అయిన నిర్మాణ వ్యయం అక్షరాలా పదిహేను లక్షలు. 1983 అక్టోబర్ 28 విడుదలైన ఈ చిత్రం ఆంధ్రదేశంలో పెను సంచలనానికే తెరలేపింది. చిరంజీవి నట విశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక మాధవి, సుమలత అందచందాలు యువతరాన్ని విశేషంగా అలరించాయి. ప్రతినాయకులుగా రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్‌లు అదరహో అనిపించారు. చక్రవర్తి బాణీలు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్రనే పోషించాయి. ‘వేదం నాదం మోక్షం’, ‘రగులుతోంది మొగలిపొద’, ‘గోరింక పూచిందీ..’ ఇలా ప్రతి పాట ఓ ఆణిముత్యమే. వేటూరి, రాజశ్రీ ఈ పాటలకు అద్భుతమైన సాహిత్యం అందించారు. అప్పటివరకూ కుటుంబ చిత్రాల దర్శకునిగా పేరున్న కోదండరామిరెడ్డిని రాత్రికి రాత్రి మాస్ డెరైక్టర్ని చేసేసింది ‘ఖైదీ’. ఈ సినిమా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో పదిహేడు చిత్రాలు రూపొందాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించిన ఏక్నాథ్... తన కెరీర్లో బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ‘ఖైదీ’ని ప్రముఖంగా చెప్పుకుంటారు. నిప్పులుగక్కే స్టెన్‌గన్స్, అగ్ని కీలలు వెదజల్లే బాంబ్ బ్లాస్టింగులు ‘ఖైదీ’ నుంచే తెలుగు తెరపై మొదలయ్యాయి. 36 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 20 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది. మొదటివారమే 34 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుటికీ చిరంజీవి గురించి చెప్పుకోవాలంటే తొలుత గుర్తొచ్చే సినిమా ‘ఖైదీ’నే. ప్రేమ, పగ, సెంటిమెంట్, సంగీతం కలగలిసిన పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ‘ఖైదీ’. అందుకే ‘ఖైదీ’ ఓ సంచలనం, ఓ ప్రభంజనం, ఓ చరిత్ర.