
'వాళ్లిద్దరినీ తెరపై చూడాలనుకుంటున్నా'
తన భార్య కాజోల్.. షారూఖ్ ఖాన్ తో కలిసి నటిస్తుండడం పట్ల ఆమె భర్త అజయ్ దేవగన్ సంతోషం వ్యక్తం చేశారు.
ముంబై: తన భార్య కాజోల్.. షారూఖ్ ఖాన్ తో కలిసి నటిస్తుండడం పట్ల ఆమె భర్త అజయ్ దేవగన్ సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో హిట్ ఫెయిర్ గా పేరు గాంచిన షారూఖ్-కాజోల్ ను మరోసారి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడించాడు.
దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషీ కబీ గమ్ హిట్ సినిమాల్లో షారూఖ్, కాజోల్ కలిసి నటించారు. వీరు చివరిసారిగా కలిసి నటించిన సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ 2010లో విడుదలైంది. ఐదేళ్ల తర్వాత షారూఖ్-కాజోల్ జోడి కెమెరా ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్, బొమన్ ఇరానీ, వినోద్ ఖన్నా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.