ఆయనే నా గురువు, సోదరుడు : రెహమాన్
చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తనకు గురువు, సోదరుడని స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ కొనియాడారు. రోజా సినిమా రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మణిరత్నం ‘రోజా’ ద్వారానే రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆయన దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువగా తనకు సోదరుడు, గురు సమానుడని చెప్పుకున్నారు. గొప్ప మానవతాగుణమే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసిందని చెప్పారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కాట్రువెలిఇదై’ అనే తమిళ త్వరలో సినిమా రానుంది.