Ilaiyaraaja Gave Dinner To FEFSI Members - Sakshi
Sakshi News home page

Ilaiyaraaja: విందు, వినోదాలకు దూరంగా ఉండే ఇళయరాజా తొలిసారి విందిచ్చారు

Aug 26 2022 4:14 PM | Updated on Aug 26 2022 4:56 PM

Ilaiyaraaja Gave Dinner to FEFSI Members - Sakshi

సంగీతజ్ఞాని ఇళయరాజా సాధారణంగా విందూ వినోదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఆయనే ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) నిర్మాహకులకు తొలిసారి విందును ఇవ్వడం విశేషం. ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టడం, ఆయన పదవీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి.

ఫెఫ్సీ నిర్వాహకులతో ఇళయరాజా

రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇళయరాజా ఫెఫ్సీలో భాగం అయిన 23 శాఖల నిర్వాహకులకు విందునిచ్చారు. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, మనోబాలా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement