South Indian film workers federation
-
విందు, వినోదాలకు దూరంగా ఉండే ఇళయరాజా తొలిసారి విందిచ్చారు
సంగీతజ్ఞాని ఇళయరాజా సాధారణంగా విందూ వినోదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఆయనే ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) నిర్మాహకులకు తొలిసారి విందును ఇవ్వడం విశేషం. ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టడం, ఆయన పదవీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఫెఫ్సీ నిర్వాహకులతో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇళయరాజా ఫెఫ్సీలో భాగం అయిన 23 శాఖల నిర్వాహకులకు విందునిచ్చారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, మనోబాలా తదితరులు పాల్గొన్నారు. -
ఫెఫ్సీ సమ్మె విరమణ
తమిళసినిమా: మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) గురువారం సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఫెఫ్సీ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కె.సెల్వమణి మాట్లాడుతూ మూడు రోజులుగా 40 చిత్రాలకు పైగా షూటింగ్లకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. నటుడు రజనీకాంత్, దర్శకుల సంఘం ఇతర సినీ ప్రముఖులు విజ్ఞప్తి మేరకు ఫెఫ్సీ సభ్యులతో చర్చలు నిర్వహించి సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి యథాతథంగా ఫెఫ్సీ సభ్యులు షూటింగ్లలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.