ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రూమార్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ సెలబ్రెటీల ఆరోగ్యంపై రకరకాల పుకార్లను సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ సెలబ్రెటీని ఆకతాయిలు వదలడం లేదు. కొంతమంది సీనియర్ నటీనటుడు తెరపై కనిపించకపోవడంతో వారు ఆనారోగ్యం బారిన పడ్డారంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంకా చెప్పాంటే బతికి ఉన్న వారిని సైతం చనిపోయారంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఎదుర్కొన్నారు.
ఇళయరాజా అంటే పరిచయం అక్కర్లేని పేరు. అంత్యంత ప్రముఖులైన ఆయనపైనే కొందరు పుకార్లు సృష్టించి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేశారు. గత కొద్ది రోజులుగా ఇళయరాజా ఎక్కువగా బయటకు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఆరోగ్యం విషమించింది! ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.! వెంటిలెటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందించడం లేదు! అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.
అయితే వాటినన్నింటిని ఒక్క వీడియోతో చెక్ పెట్టారు మ్యూజిక్ మేస్ట్రో ఇళయారాజా..! ఓ వీడియో షేర్ చేస్తూ తన స్టైల్లో పాట పాడుతూ.. రెట్టింపు ఉత్తాహంతో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, చాలా ఉత్సాహంతో ఉన్నానన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మోద్దని, అభిమానులంతా ధైర్యంగా ఉండాలన్నారు. అంతే కాదు ఈ వీడియోతో తన అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment