గ్రామీణ కథా చిత్రాలతో 1980లో వరుస విజయాలను అందుకున్న నటుడు రామరాజన్. మక్కళ్ నాయకన్‌గా ప్రజల మన్ననలను అందుకున్న ఈయన నటించిన అత్యధిక చిత్రాలకు ఇళయరాజానే సంగీతాన్ని అందించారు అనేది గమనార్హం. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఈయన 13 ఏళ్ల తర్వాత తాజాగా సామాన్యన్ అనే చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు.
దీన్ని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వి మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు తంబికోట్టై, మరైంది రుందు పార్కుమ్ మర్మం ఎన్నా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్. రాఖేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నటుడు రాధారవి, దర్శకుడు కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్, శరవణన్ సుబ్బయ్య లియో శివ, నక్ష చరణ్, స్మతి వెంకట్, అపర్ణలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సామాన్యన్ చిత్ర కథానాయకుడు రామరాజన్, దర్శక,నిర్మాతలు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సంగీత దర్శకుడు ఇళయరాజాను ఆయన రికార్డింగ్ థియేటర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, షూటింగ్ తర్వాతే సంగీతాన్ని అందించడానికి మీ వద్దకు వస్తామని చెప్పడంతో ఇళయరాజా ఆశ్చర్యపోయినట్లు నిర్మాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment