
కరుణానిధి, ఇళయరాజా(ఫైల్)
చెన్నై : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధి త్వరితగతిన కోలుకోవాలని సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రత్యేకంగా పాటపాడారు. తాను ఎంతగానో అభిమానించే కరుణానిధి క్షేమంగా తిరిగి రావాలని, 'లేచిరా మమ్ముల్ని చూసేందుకు..' అంటూ ఇళయరాజా పాట పాడారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ పాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అభిమానుల పూజలు, ప్రార్థనలతో ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి పరిసరాలు మునిగిపోయాయి.
కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కావేరి ఆస్పత్రికి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాలిన్, కనిమొళిలతో వారంతా భేటీ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కరుణ సంపూర్ణ ఆర్యోగవంతుడిగా మళ్లీ ప్రజా సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు నేతలు పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు సోమవారం కరుణానిధిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. కావేరి ఆస్పత్రికి పరామర్శ నిమిత్తం వచ్చిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, మత్స్యశాఖ మంత్రి జయకుమార్ కావేరి, బీజేపీ నేతలు మురళీధరరావు, ఇలగణేషన్, తమిళిసై సౌందరరాజన్, సీపీ రాధాకృష్ణన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కార్యదర్శి డి.రాజ, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తరఫున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, ఎండీఎంకే నేత వైగో, ద్రవిడ కళగం నేత వీరమణి, రైతు సంఘం నేత టీఆర్ పాండియన్, మదురై ఆధీనం అరుణగిరినాథర్, సినీ నటుడు సత్యరాజ్, తదితరులు ఉన్నారు.
కరుణానిధి కోలుకోవాలని ఇళయరాజా పాడిన పాట
Comments
Please login to add a commentAdd a comment