ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందుతున్న చిత్రం "ఉలగమై". '96' చిత్రం ఫేమ్ గౌరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రీ మిత్రన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో జీఎం. సుందర్, ప్రణవ్, అరుణ్మణి, కాందరాజ్, జయంతి మాల, అనిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్వీఎం ప్రొడక్షన్స్ పతాకంపై వి.మహేశ్వరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఎస్.సముద్రం రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 1970లో జరిగిన జాతి సమస్యల ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment