Ilaiyaraaja Speech At Kadhal Sei Movie Trailer Launch, Check What He Says - Sakshi
Sakshi News home page

Ilaiyaraaja: 'నేను కూడా ప్రేమించాను.. అది పలు విధాలుగా ఉంటుంది'..

Published Tue, Mar 22 2022 9:08 AM | Last Updated on Tue, Mar 22 2022 10:29 AM

Ilaiyaraaja Speech At Kadal Sei Movie Trailer Launch - Sakshi

Ilaiyaraja speech at Kadhal Sei Movie Trailer Launch: తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఈయన సంగీతాన్ని అందించిన చిత్రం కాదల్‌ సెయ్‌. ప్రభాకర్‌ మూవీస్‌ పతాకంపై ఘన వినోదన్‌ నిర్మించిన ఈ చిత్రానికి గణేషన్‌ దర్శకత్వం వహించారు. సుభాష్‌, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ సోమవారం టీ. నగర్‌. పెరియార్‌ రోడ్‌లోని ఇళయారాజా స్టూడియోలో జరిగింది.

ఇళయరాజా, దర్శకుడు భారతీరాజా, పి. వాసు ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ. .. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. కాదల్‌ సెయి చిత్రాన్ని అందరూ ఆదరించాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement