Ilaiyaraaja: పాట వికసిస్తున్న పువ్వులా ఉండాలని సంగీత జ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. మనసుకు వయసుతో పనిలేదు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఈ మాస్ట్రో. ఇళయరాజా వయసు (78). మనసు మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలా సంగీతంలో పరవళ్లు తొక్కుతుంది. శతాధిక చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా నేటికీ బిజీ సంగీత దర్శకుడే. ఈయన ఇటీవల టీ.నగర్‌లో సొంత రికార్డింగ్ థియేటర్ నిర్మించుకోవడం తెలిసిందే. గురువారం ఉదయం ఆ స్టూడి యోలో మీడియాతో ముచ్చటించారు. ఇళయరాజా సంగీతం అందించిన 16 వయదినిలే చిత్రం విడుదలై 40 వసంతాలను, ముందానై ముడిచ్చి 38 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి.
ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన ఆయన ఇళయరాజా పాట ఇప్పుడే వికసిస్తున్న పువ్వులా ఉండాలి. అయితే పాటలు ఒకటి, రెండు రోజుల్లోనే వాడిపోయిన పువ్వులా కనుమరుగైపోతున్నాయి. నేను రూపొందించిన 20 ఏళ్ల నాటి పాటల్ని కూడా ప్రేక్షకులు వినడానికి ఆసక్తి చూపుతున్నారంటే అవి వికసిస్తున్న పువ్వులా నిత్య నూతనంగా ఉండడమే. అదేవిధంగా నా పాటలు కొత్తదనం అనేది ఇకపై కూడా కొనసాగుతుందని ఇళయరాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment