గీత స్మరణం | Song of the day from rajendra prasad April 1 Vidudala movie | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Sun, Dec 22 2013 10:57 PM | Last Updated on Tue, Nov 6 2018 4:19 PM

Song of the day from rajendra prasad April 1 Vidudala movie

పల్లవి :


 ఆమె: ఒక్కటే ఆశ అందుకో శ్వాస
 అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా
 (2)
 అతడు: చుక్కనే చూశా లెక్కలే వేశా
 నింగిపై అంగలే వేశా కిందికే దించేశా
 (2)
 ఆ: ఒక్కటే ఆశ...
 అ: అందుకో శ్వాసా...
 
 చరణం : 1
 
 ఆ: మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం ఆడపుట్టుకే అందుకోసం
 అ: గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం పాదపూజలే అది పాఠం
 ఆ: చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా
 అ: దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్థకం పొమ్మిక
 ఆ: మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం
 అ: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా
 ఆ: అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా
 ఆ: ఒక్కటే ఆశ...
 అ: అందుకో శ్వాస...
 
 చరణం : 2
 
 ఇద్దరు: తాతారరు తారరు తాతారరు తారూ తాతరరు తారరు
 తాతారరు తారూ తారా తారారా తారారా తారరారా
 అ: నచ్చనే నారీ వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సఖ్యం
 ఆ: మెచ్చెనే చేరీ ముచ్చటే తీరీ ఇచ్చెనే ప్రేమరాజ్యం అంతులేనిదే సంతోషం
 అ: స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా
 ఆ: స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా
 అ: మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం    ॥
 
 చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)
 రచన : సిరివెన్నెల
 సంగీతం : ఇళయరాజా
 గానం : మనో, కె.ఎస్.చిత్ర

 
 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement