
సిటీ సై
టిక్.. టిక్.. టిక్.. కాలం గుర్రం డెక్కల చప్పుడు.. అచ్చం మన గుండె శబ్దిస్తున్నట్టుగా.. గంటలు.. నిమిషాలు కాలం ఒడిలో కరుగుతున్నాయి. కొత్త ఏడాది సమీపిస్తోంది. గ్రేటర్ సిటీజన్లు వేడుకలకు రెడీ అవుతున్నారు. మహానగర వ్యాప్తంగా ఉన్న పబ్‌లు, రిసార్ట్‌లు, క్లబ్‌లు వినూత్న స్వాగతానికి సిద్ధమవుతున్నాయి.
డీజే.. రాక్.. పాప్ ఈవెంట్స్‌లో జోష్ నిపేందుకు.. డ్యాన్స్ ఫ్లోర్‌లను అదరగొట్టేందుకు యువత సై అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ డీజేలు, సింగర్స్‌తో పాశ్చాత్య సంగీత ఝరి ఉర్రూతలూగించనుంది. – సాక్షి,సిటీబ్యూరో