
డిజిటల్ సింగిల్ ‘కీపింగ్ ది ఫైర్’తో ఆరంగేట్రం చేసింది ‘ఎక్స్: ఇన్’ అనే అయిదుగురు సభ్యుల మల్టీనేషనల్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్‌లోని సభ్యుల పేర్లు.. ఇషా, నిజ్, హన్నా, నోవ, ఆరియా (ఇండియా) సెకండ్ మినీ ఆల్బమ్ ‘ది రియల్’తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ‘ఎక్స్:ఇన్’ బృందం.
‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’ అంటుంది మెయిన్ ర్యాపర్, లీడ్ డ్యాన్సర్ నోవ. ఈ ఆల్బమ్ తమ పర్సనల్ స్టోరీలకు సంబంధించిన ‘మ్యూజికల్ ఎక్స్‌ప్రెషన్’ అని కూడా అంటుంది నోవ. ‘ది రియల్’లో నో డౌట్, మై ఐడల్, విత్‌డ్రా, నెవర్ సారీ అనే పాటలు ఉన్నాయి. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి ఉన్నతస్థానానికి చేరడమే ఆల్బమ్‌లోని పాటల సారాంశం.
‘కష్టాలు ఉన్నట్లే వాటిని అధిగమించే దారులు ఉన్నాయి. అయితే ఆ దారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది’ అంటుంది ఆరియా.
ఇవి చదవండి: Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్‌రైట్!