![Natania Lalwani, Subhi And Shalmali Kholgade's New Song From Desi Thrill Music Band](/styles/webp/s3/article_images/2024/05/17/Desi-Thrill.jpg.webp?itok=9zso-bqI)
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ముగ్గురు గాయకులు... నతనియ లాల్వాని, సుభి, షల్మాలి ఖోల్గాడేలు ‘వావ్’ అనుకునేపాటను తీసుకువచ్చారు. ఈ కొత్త సాంగ్ ‘ముంబై మ్యాజిక్’ నిజంగానే మ్యాజిక్ చేసింది.
హెరిటేజ్, హాసల్, హోప్ అనే మాటలతో రూపుదిద్దుకున్నపాట ఇది. ‘ముంబైవాసిగా ఈపాట నన్ను ఎన్నో జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లింది’ అంటుంది నతనియ. ‘దేశీ ఎట్ హార్ట్’ అని తన గురించి పరిచయం చేసుకునే సుభి న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిల్స్‌లాంటి ఎన్నో ్ర΄ాంతాలలో నివసించింది. అయినప్పటికీ స్వదేశీ మూలాలకు ఎప్పుడూ దూరం కాలేదు.
బ్రాడ్‌వే, జాజ్‌లాంటి డిఫరెంట్ మ్యూజిక్ జానర్స్‌కు దేశీ టచ్ ఇచ్చింది.‘ఎన్నో విలువైన జ్ఞాపకాలకుపాట రూపం ఇచ్చే అవకాశం దక్కింది’ అంటుంది ‘ముంబై మ్యాజిక్’ గురించి. ‘ముంబై మహానగరంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేపాట ఇది. ముంబై నగర ముఖచిత్రాన్ని వివిధ వర్ణాలలో అందంగా చూపినపాట. నగరంలోని వేగాన్ని, నిశ్శబ్దాన్ని, వెలుగు, నీడలను పట్టించేపాట ఇది’ అంటుంది షల్మాలి.
ఇవి చదవండి: ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
Comments
Please login to add a commentAdd a comment