‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించి నానిలో జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. విక్రమ్ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్ షూటింగ్ జరపుకుంటుండగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. అయితే శ్రీకాంత్ అడ్డాలతో నాని ఓ సినిమాను చేయబోతోన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బ్రహ్మోత్సవం తరువాత భారీ గ్యాప్ తీసుకుని కూచిపూడి వారి వీధి అనే స్క్రిప్టును రెడీ చేశాడని, అది నానికి కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్ వినిపించింది. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులు నాని దృష్టికి తీసుకురాగా ఓ క్లారిటీని ఇచ్చాడు. అదంతా అవాస్తవని స్పష్టం చేశాడు. ఫాల్స్ న్యూస్ మై బాయ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరి కాంబినేషన్‌లో ఆ చిత్రం రావడంలేదని తేలిపోయింది.
False news my boys :)
— Nani (@NameisNani) 2 June 2019
Comments
Please login to add a commentAdd a comment