ఆకట్టుకుంటున్న 'చిక్లెట్స్' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ | Srikanth Addala Launched Chiclets First Look poster | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న 'చిక్లెట్స్' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Published Sat, Nov 5 2022 5:50 PM | Last Updated on Sat, Nov 5 2022 5:50 PM

Srikanth Addala Launched Chiclets First Look poster - Sakshi

యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం ముత్తు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు.  2K కిడ్స్ యొక్క యువ శక్తిని వెండితెరపై చూపించనున్నాడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'చికిలెట్స్‌' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రస్తుతం  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని సెన్సిబుల్ ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు.

చిక్లేట్స్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ కుమారుడు, బాల నటులుగా పనిచేసిన రజీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నయన్ కరిష్మా, అమృత హల్దార్ మరియు మంజీర ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌బీ(SSB) ఫిల్మ్ బ్యానర్‌పై శాంతి శ్రీనివాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కి బాల మురళి బాలు సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement