ఎయిర్ పోర్ట్ రన్‌వే పై వరుణ్ తేజ్... | Varun Tej shooting in airport at Tadepalligudem of West godavari | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్ట్ రన్‌వే పై వరుణ్ తేజ్...

Published Sun, Jun 15 2014 10:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

విమానాశ్రయ రన్‌వే పై పాట చిత్రీకరణలో వరణ్ తేజ్ - Sakshi

విమానాశ్రయ రన్‌వే పై పాట చిత్రీకరణలో వరణ్ తేజ్

హీరో నాగేంద్రబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా లియో ప్రొడక్ష న్స్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తాడేపల్లిగూడెం విమానాశ్రయ రన్‌వే వద్ద శనివారం జరిగింది. పాటకు సంబంధించిన కీలక దృశ్యాలను చిత్రీకరించారు.
 
 బురద నీటిలో హీరో, సహ నటులు పాల్గొనే నృత్య సన్నివేశాలకు డాన్స్ డెరైక్టర్ రాజు సుందరం దర్శకత్వం వహించారు. పాట చిత్రీకరణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పర్యవేక్షించారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రాచుర్యంలో ఉంది. హీరోయిన్‌గా అలనాటి హిందీ నటి షబానా అజ్మీ మేనకోడలు నటిస్తున్నట్టు సమాచారం.
 
 సంగీతం మిక్కీ జే. మేయర్ అందిస్తుండగా కెమెరామెన్‌గా మణికంఠ పనిచేస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల విజయంతో ఊపుమీద ఉన్న  శ్రీకాంత్ అడ్డాల హ్యాట్రిక్ విజయం కోసం  పట్టుదలతో ఈ సిని మాలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement