
వరుణ్ తేజ్‌శ్, రీకాంత్ అడ్డాల
‘ముకుంద’ సినిమాతో వరుణ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేశారు దర్శ కుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమా కోసం కలసి పని చేయనున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ కు దర్శకత్వం వహిస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment