శ్రీకాంత్ అడ్డాల,
మంచి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకులు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద’ చిత్రాలు మంచి ప్రేక్షాకాదరణ పొందాయి. ఇప్పుడు మరో మంచి చిత్రాన్ని ఆడియన్స్‌కు అందించేందుకు రెడీ అవుతున్నారాయన. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. హీరోహీరోయిన్ల పేర్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయట. త్వరలో అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment