
గోదావరి జిల్లాల్లో షూటింగ్
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుకానుంది. గోదావరి జిల్లాల్లోనే దాదాపుగా చిత్రీకరణ జరగనుందని తెలిసింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక పనిలో ఉన్నారు. మిక్కీ జే.మేయర్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు.