శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో...
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో...
Published Sat, Nov 9 2013 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. వరుణ్ నటించే తొలి సినిమా విషయంలో గత కొన్నేళ్లు పలు ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. క్రిష్, శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాథ్... ఇలా పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే... అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ వార్తా రాలేదు. మరో మెగా వారసుని ఆగమనం కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో... ఎట్టకేలకు వరుణ్ తొలి సినిమాకు సంబంధించిన వార్త అధికారికంగా వెలువడింది.
వరుణ్‌తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి). మిక్కీ జె.మేయర్ స్వరాలందించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 1 నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం ఉన్న ఏ హీరోకీ తీసిపోని అందం వరుణ్‌తేజ్ సొంతం. ఫస్ట్ లుక్‌తోనే అందరి ప్రశంసలూ అందుకున్నాడు వరుణ్. మరి తొలి సినిమాలో వరుణ్‌ని శ్రీకాంత్ ఎలా చూపించనున్నాడో, నటుడిగా తొలి అడుగుని ఏ విధంగా వేయించనున్నారో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.
Advertisement
Advertisement