Nallamalupu Bujji
-
తమకు అనుకూలమైన వారికే అవార్డ్స్ ఇచ్చారా?
-
వసూళ్లలో నంబర్ ఫోర్ మేమే!
తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా మా ‘రేసు గుర్రం’ నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ కెరీర్లోనే ఇది నంబర్ వన్ సినిమా. అమెరికాలో కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది’’ అని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) చెప్పారు. అల్లు అర్జున్, శ్రుతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డా.కె. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన నిర్మించిన ‘రేసుగుర్రం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో బుజ్జి ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం మీద నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. అందుకే చాలా ఏరియాల్లో మేమే సొంతంగా పంపిణీ చేశాం. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలు చవిచూపించింది. నాలుగో వారంలోనూ మంచి షేర్స్ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రియల్‌గా యాభై రోజులు ప్రదర్శితం కానున్న సినిమా ఇదే. త్వరలో భారీ ఎత్తున యాభై రోజుల వేడుక కూడా చేయనున్నాం’’ అని బుజ్జి తెలిపారు. ‘రేసు గుర్రం’ విజయానికి గల కారణాలను బుజ్జి విశ్లేషిస్తూ -‘‘ఈ కథలో దమ్ముంది. మంచి సెంటిమెంట్ ఉంది. బన్నీ, సురేందర్‌రెడ్డి ఈ సినిమా విజయానికి మూలస్తంభాలుగా నిలిచారు. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగా కలిసొచ్చింది’’ అన్నారు. ఇతర ప్రాజెక్టుల గురించి బుజ్జి వివరిస్తూ -‘‘నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తీస్తున్న సినిమా సుమారు నలభై శాతం పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొత్త హీరో హీరోయిన్లతో ఓ సినిమా చేయబోతున్నాం. సునీల్ హీరోగా రచయిత విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్‌తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సూర్య-మురుగదాస్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నా. వీటన్నిటికీ కూడా ‘ఠాగూర్’ మధు నిర్మాణ భాగస్వామి’’ అని తెలిపారు. మీపై పొగరుబోతు అనే ముద్ర ఉండటానికి గల కారణమేమిటని అడిగితే -‘‘ఇప్పుడు చాలామంది నిర్మాతలు కేవలం పెట్టుబడిదారులుగానే మిగిలిపోతున్నారు. నాలాంటి కొంతమంది మాత్రమే సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ జోక్యాన్ని చూసి చాలామంది పొగరు అనుకుంటున్నారు. అయినా ఏం ఫర్లేదు. సినిమా బాగా రావడానికి చివరి క్షణం వరకూ చిత్తశుద్ధితో పనిచేస్తాను’’ అని బుజ్జి సమాధానమిచ్చారు. -
రేసుగుర్రం మూవీ పోస్టర్స్
-
రేసుగుర్రం మూవీ స్టిల్స్
-
వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్టుకు పూజలు
సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :వరుణ్ తేజ్ హీరోగా తీయనున్న కొత్త చిత్రం స్క్రిప్టును దర్శకుడు అడ్డాల శ్రీకాంత్, అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పాదాల చెంత ఉంచి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రం తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌తో ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. లియో ఫిల్మ్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారన్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నారన్నారు. గోదావరి డెల్టాలో జరిగే అందమైన ప్రేమ కథా చిత్రమిదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈనెల 27న శివరాత్రి పర్వదినాన హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని శ్రీకాంత్ తెలిపారు. -
మెరుపువేగంతో రేసుగుర్రం
లక్ష్య ఛేదనే ధ్యేయం. మెరుపు వేగమే నైజం. గెలుపు కోసం అలుపెరగని పరుగే ఆభరణం... రేసుగుర్రం అనగానే... అందరికీ కనిపించే క్వాలిటీలివి. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శనివారం వరకూ ఆర్ఎఫ్సీలో జరిగింది. అక్కడ హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను బన్నీ, ‘కిక్’శ్యామ్, సలోని, తనికెళ్ల భరణిలపై చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఈ షెడ్యూల్ మెరుపు వేగంతో జరుగుతోంది. డిసెంబర్ తొలివారం వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. భిన్నమైన కథ, కథనాలతో సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇందులో బన్నీ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, బన్నీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయేలా ఈ సినిమా ఉండబోతోందని యూనిట్ వర్గాల సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో సుహాసినీ మణిరత్నం, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్. -
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో...
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. వరుణ్ నటించే తొలి సినిమా విషయంలో గత కొన్నేళ్లు పలు ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. క్రిష్, శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాథ్... ఇలా పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే... అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ వార్తా రాలేదు. మరో మెగా వారసుని ఆగమనం కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో... ఎట్టకేలకు వరుణ్ తొలి సినిమాకు సంబంధించిన వార్త అధికారికంగా వెలువడింది. వరుణ్‌తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి). మిక్కీ జె.మేయర్ స్వరాలందించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 1 నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం ఉన్న ఏ హీరోకీ తీసిపోని అందం వరుణ్‌తేజ్ సొంతం. ఫస్ట్ లుక్‌తోనే అందరి ప్రశంసలూ అందుకున్నాడు వరుణ్. మరి తొలి సినిమాలో వరుణ్ని శ్రీకాంత్ ఎలా చూపించనున్నాడో, నటుడిగా తొలి అడుగుని ఏ విధంగా వేయించనున్నారో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.