వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్టుకు పూజలు | Varun Tej film worshiped a script | Sakshi
Sakshi News home page

వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్టుకు పూజలు

Published Mon, Feb 24 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్టుకు పూజలు

వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్టుకు పూజలు

 సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :వరుణ్ తేజ్ హీరోగా తీయనున్న కొత్త చిత్రం స్క్రిప్టును దర్శకుడు అడ్డాల శ్రీకాంత్, అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పాదాల చెంత ఉంచి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం అర్చకులు వారికి  ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రం తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌తో ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. లియో ఫిల్మ్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారన్నారు.  మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నారన్నారు. గోదావరి డెల్టాలో జరిగే అందమైన ప్రేమ కథా చిత్రమిదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈనెల 27న  శివరాత్రి పర్వదినాన హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని శ్రీకాంత్ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement