మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు : చిరంజీవి | Varun Tej's Debut Film Launched: Pawan Kalyan, Chiranjeevi, Allu Arjun Attend | Sakshi
Sakshi News home page

మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు : చిరంజీవి

Published Thu, Feb 27 2014 10:52 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు : చిరంజీవి - Sakshi

మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు : చిరంజీవి

 ‘‘కష్టపడితేనే పైకొస్తామని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మా కుటుంబానికి చెందిన హీరోలందరికీ చెబుతుంటాను. మా అందరికీ అభిమానులే అండా దండా. మా మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు. నాగబాబు చాలా అదృష్టవంతుడు. మెగా అభిమానులందరికీ తనంటే ప్రాణం’’ అన్నారు చిరంజీవి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ  లియో ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.
 
 ముహూర్తపు దృశ్యానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్, డి. సురేష్‌బాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, అల్లు శిరీష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ అని, కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన క్లారిటీ నేపథ్యంలో సాగే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల 15న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: మణికందన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement