
ఈ ఏడాది మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’
శ్రీకాకుళం : ఈ ఏడాది ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా బ్రహ్మోత్సవం అనే కొత్త చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ వెల్లడించారు. సోమవారం ఆయన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు.
అనంతరం అనివెట్టి మండపంలో అర్చక బృందం వారిని ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అడ్డాల మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటివరకు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద తదితర ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను తీశానన్నారు. ఈ చిత్రాలు విజయవంతమడం అన్నివిధాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.